ఎన్టీఆర్ కథపై కొరటాల కసరత్తులు!

03-05-2021 Mon 10:41
  • 'ఆచార్య' సినిమాతో బిజీగా కొరటాల
  • తరువాత ప్రాజెక్టు ఎన్టీఆర్ తో
  • త్వరలోనే సెట్స్ పైకి

Koratala Shiva modifying his previous script for Ntr

కొరటాల శివ సినిమాలను పరిశీలిస్తే, తెరపై తాను చెప్పదలచుకున్న కథ విషయంలో ఆయన ఎంత క్లారిటీగా ఉంటారో అర్థమవుతుంది. కథ పట్టుకుని సెట్స్ పైకి వచ్చిన తరువాత ఇక ఆయనలో తడబాటు ఉండదు. ఏ మోతాదులో  వినోదం ఉండాలో .. ఏ మోతాదులో సందేశం ఉండాలో ఆయనకి బాగా తెలుసు. అందువల్లనే ఇంతవరకూ ఆయన హిట్టు మాటనే విన్నారు. అలాంటి కొరటాల .. 'ఆచార్య' తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమాను చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథపైనే ఆయన కసరత్తు చేస్తున్నారట.

ఈ కథను కొరటాల ఇంతకుముందు రాసుకున్నదే. అయితే ఈ సినిమా కంటే ముందుగా ఎన్టీఆర్ నటించిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అప్పటి నుంచి ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోవడమే కాకుండా, ఆయన పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోనున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కొరటాల తన స్క్రిప్ట్ పై మరింత కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికైతే కథానాయికగా కైరా అద్వాని పేరు వినిపిస్తోంది.