తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

03-05-2021 Mon 10:07
  • కొత్త‌గా 5,695 మందికి కరోనా పాజిటివ్
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,485
  • కోలుకున్న వారు మొత్తం 3,73,933 మంది
  • మృతుల సంఖ్య 2,417
5695 new corona cases in telangana

తెలంగాణ‌లో క‌రోనా కేసుల విజృంభ‌ణ కాస్త త‌గ్గింది.  మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 5,695 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,206 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,73,933 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,417గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 80,135 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,352 మందికి క‌రోనా సోకింది.