బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ ఘోర ఓటమి

03-05-2021 Mon 08:58
  • తిరుపతి నుంచి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ
  • తమిళనాడులో అరవకురచ్చి నుంచి బరిలోకి అణ్ణామలై
  • ఇద్దరినీ వెంటాడిన ఓటమి
IPS IAS BJP Candidates defeated

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దారుణ పరాజితులుగా మిగిలారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ..  గతంలో కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గురుమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇక, కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా వివిధ జిల్లాల్లో పనిచేసిన అణ్ణామలై తమిళనాడులోని అరవకురచ్చి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనను కూడా పరాజయం వెంటాడింది.