తెలంగాణలో ప్రారంభమైన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

03-05-2021 Mon 08:17
  • బ్యాలెట్ పత్రాలతో ఎన్నికల నిర్వహణ
  • ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం
  • కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
Municipal Election Counting Started

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట మునిసిపాలిటీలు, జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజీగూడ, మరో నాలుగు మునిసిపాలిటీల్లోని నాలుగు వార్డులకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లెక్కింపునకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

మొన్న, నిన్న చేయించుకున్న కరోనా పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చిన వారినే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించడంతో ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉంది.