నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్

02-05-2021 Sun 20:50
  • తిరుపతి పార్లమెంటు స్థానంలో వైసీపీ విజయం
  • 2.70 లక్షల మెజారిటీతో గురుమూర్తి గెలుపు
  • 2019లో 2.28 లక్షల మెజారిటీ వచ్చిందన్న సీఎం జగన్
  • ఇప్పుడు అంతకుమించి మెజారిటీ ఇచ్చారంటూ కృతజ్ఞతలు
CM Jagan congratulates Gurumurthy who wins Tirupati by polls

ఏపీ సీఎం జగన్ తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ఫలితంపై స్పందించారు. నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. 23 నెలల పాలన తర్వాత తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని వెల్లడించారు.

తిరుపతి పార్లమెంటు ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవిస్తే... మనందరి ప్రభుత్వం చేసిన మంచిపనిని మనసారా దీవించి ఇవాళ మరింత మెజారిటీ ఇవ్వడం ద్వారా చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. తిరుపతి విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. దేవుని దయ, అందరి చల్లని దీవెనలతో ఈ విజయం సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు.