Kamal Haasan: కోయంబత్తూరులో కమల్ హాసన్ వెనుకంజ

Kamal Haasan trails in Coiambatore assembly constituency
  • కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన కమల్
  • 1000 ఓట్ల తేడాతో ముందంజ వేసిన వనతి శ్రీనివాసన్
  • బీజేపీ తరఫున పోటీ చేసిన వనతి
  • మరికాసేపట్లో ఫలితం వెల్లడి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో తొలుత పలు రౌండ్ల పాటు కమల్ తన సమీప ప్రత్యర్థి, బీజేపికి చెందిన వనతి శ్రీనివాసన్ పై ఆధిక్యంలో ఉన్నారు.

అయితే, ఓట్ల లెక్కింపు చివరి దశకు వచ్చేటప్పటికి ఆయన 1000 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. కోయంబత్తూరులోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కమల్, వనతి శ్రీనివాసన్, ఇతర అభ్యర్థులు కౌంటింగ్ హాల్ వద్దే ఎంతో ఉత్కంఠ నడుమ ఫలితాల సరళిని గమనిస్తున్నారు.
Kamal Haasan
Coiambatore
Trail
Assembly
MNM
Tamilnadu

More Telugu News