తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు: రాహుల్‌ గాంధీ

02-05-2021 Sun 19:21
  • డీఎంకే అధినేత స్టాలిన్‌కు శుభాకాంక్షలు
  • స్టాలిన్‌ నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ
  • ఒక్క తమిళనాడులోనే కాంగ్రెస్‌కు అనుకూల ఫలితం
Tamilnadu people have voted for change Rahul Gandhi

తమిళనాడులో విజయం సాధించిన కూటమి భాగస్వామి డీఎంకే అధినేత స్టాలిన్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని వ్యాఖ్యానించారు. స్టాలిన్‌ నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

కాంగ్రెస్‌కు ఒక్క తమిళనాడు మినహా తాజాగా ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనూ అనుకూల ఫలితాలు రాకపోవడం గమనార్హం. ఒక్క తమిళనాడులోనే ప్రధాన పార్టీ డీఎంకేతో కలిసి అధికారంలోకి రాబోతోంది. ఇంకా పూర్తి ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికే డీఎంకే విజయం ఖాయమైంది. 234 స్థానాలున్న తమిళనాడులో అధికారానికి 118 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది.