అపెండిసైటిస్ తో బాధపడుతున్న క్రికెటర్ కేఎల్ రాహుల్... ఆసుపత్రికి తరలింపు

02-05-2021 Sun 19:20
  • గత రాత్రి కేఎల్ రాహుల్ కు కడుపునొప్పి
  • వైద్య పరీక్షల్లో అపెండిసైటిస్ గా గుర్తింపు
  • రాహుల్ కు శస్త్రచికిత్స చేసే అవకాశం
  • అందుకే ఆసుపత్రికి తరలించామన్న పంజాబ్ కింగ్స్ మేనేజ్ మెంట్
KL Rahul suffers with appendicitis

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేఎల్ రాహల్ అపెండిసైటిస్ తో బాధపడుతున్నట్టు పంజాబ్ కింగ్స్ వర్గాలు వెల్లడించాయి. గత రాత్రి కేఎల్ రాహుల్ కడుపునొప్పికి గురికాగా, మందులు వాడినా నయం కాకపోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు.

రాహుల్ అక్యూట్ అపెండిసైటిస్ (24 గంటల కడుపునొప్పి)తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైందని, ఇది శస్త్రచికిత్సతోనే నయం అవుతుందని, అందుకే అతడిని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కేఎల్ రాహుల్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు పంజాబ్ కింగ్స్ ఆకాంక్షించింది.