తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదు... బీజేపీకి రాష్ట్రంలో చోటులేదు: ఇంద్రకరణ్ రెడ్డి

02-05-2021 Sun 16:35
  • నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ జయభేరి
  • టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు
  • జాతీయ పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పారన్న ఇంద్రకరణ్
  • ఏడేళ్లలో బీజేపీ చేసిందేమీలేదని వెల్లడి
  • రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికేలేదని స్పష్టీకరణ
Indrakaran Reddy opines after Nagarjuna Sagar victory

నాగార్జునసాగర్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ తమ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించుకోవడం తెలిసిందే. దీనిపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేదని రెట్టించిన ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అదే సమయంలో బీజేపీకి రాష్ట్రంలో చోటు లేదని, కాంగ్రెస్ ఉనికే లేదని ఉద్ఘాటించారు. ఏడేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. రెండు జాతీయ పార్టీలకు నాగార్జునసాగర్ ప్రజలు బుద్ధి చెప్పారని ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.