తిరుపతి విజేత గురుమూర్తి... 2,70,584 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం

02-05-2021 Sun 15:53
  • తిరుపతి బరిలో ఫ్యాన్ దూకుడు
  • 5 లక్షలకు పైగా ఓట్లు సాధించిన గురుమూర్తి
  • టీడీపీకి 3 లక్షలకు పైగా ఓట్లు
  • లక్ష ఓట్లు కూడా సాధించని బీజేపీ-జనసేన
Gurumurthy lead crosses two lakhs mark in Tirupati by polls

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఘనవిజయం సాధించారు. ఆయన 2,70,584 ఓట్ల మెజారిటీతో తన సమీప టీడీపీ ప్రత్యర్థి పనబాక లక్ష్మిపై గెలుపొందారు. ఫ్యాన్ ధాటికి టీడీపీ, బీజేపీ-జనసేన రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యాయి. గురుమూర్తి విజయంతో వైసీపీ శ్రేణుల్లో సంతోషం అంబరాన్నంటుతోంది. తన విజయం పట్ల డాక్టర్ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. తన విజయానికి ఏపీ ప్రభుత్వ పాలన, సీఎం జగన్ ఛరిష్మా కారణం అని వినమ్రంగా తెలిపారు. ప్రజలు వైసీపీతోనే ఉన్నారన్న విషయం ఈ గెలుపుతో స్పష్టమైందని అన్నారు.

తిరుపతి బరిలో వైసీపీకి 6,23,774 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,53,190 ఓట్లు లభించాయి. ఆ తర్వాత స్థానంలో బీజేపీ-జనసేనకు 56,820 ఓట్లు వచ్చాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ-జనసేన అభ్యర్థి రత్నప్రభ మొత్తం ఓట్లు కనీసం లక్ష కూడా దాటలేదు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 9,549 ఓట్లు వచ్చాయి.