తిరుపతి బరిలో విజయం దిశగా డాక్టర్ గురుమూర్తి... ఇక మెజారిటీపైనే అందరి దృష్టి

02-05-2021 Sun 14:39
  • తిరుపతి ఉప ఎన్నికలో ఫ్యాన్ ప్రభంజనం
  • 11వ రౌండ్ అనంతరం గురుమూర్తికి 1,58,401 ఓట్ల ఆధిక్యం
  • ఇంకా 14 రౌండ్లు మిగిలున్న కౌంటింగ్
  • గురుమూర్తి మెజారిటీ మరింత పెరిగే అవకాశం
YSRCP candidate gets huge lead in Tirupati by polls

తిరుపతి పార్లమెంటు స్థానంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి విజయం దిశగా దూసుకెళుతున్నారు. పదో రౌండ్ ముగిసేసరికి గురుమూరి ఆధిక్యం లక్ష దాటింది. పదో రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి వైసీపీకి 3.62 లక్షల ఓట్లు, టీడీపీకి 2.03 లక్షల ఓట్లు, బీజేపీకి 35 వేలు, కాంగ్రెస్ కు 5 వేల పైచిలుకు ఓట్లు లభించాయి. ఇక, 11వ రౌండ్ దాటేసరికి డాక్టర్ గురుమూర్తి ఆధిక్యం 1,58,401కి పెరిగింది. విజయం ఖాయం కావడంతో, ఆయన ఎంత మెజారిటీతో నెగ్గుతారన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తిరుపతి లోక్ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి తిరుపతి, నెల్లూరు కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. మరో 14 రౌండ్ల లెక్కింపు మిగిలున్నందున డాక్టర్ గురుమూర్తి ఆధిక్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.