పుదుచ్చేరిలో ఎన్సార్సీ కూటమి ముందంజ

02-05-2021 Sun 13:37
  • పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 సీట్లు
  • మ్యాజిక్ ఫిగర్ 16 స్థానాలు
  • 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎన్నార్సీ కూటమి
  • కాంగ్రెస్ కూటమి 6 స్థానాల్లో ముందంజ
NRC alliance advanced in Puducherry

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం సీట్లు 30 కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ 16 స్థానాలు. ప్రస్తుతం కౌంటింగ్ ట్రెండ్స్ చూస్తే ఎన్నార్సీ కూటమి 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 6 స్థానాల్లోనూ ముందంజలో ఉంది. ఏఎంఎంకే కూటమితో పాటు, ఇతర స్వతంత్ర్య అభ్యర్థులు కనీసం ఆధిక్యంలో కూడా లేరు. ఇంకా 13 స్థానాలకు చెందిన ఓట్ల లెక్కింపు షురూ కావాల్సి ఉంది. దాంతో, పుదుచ్చేరి సమరాంగణంలో విజేత ఎవరన్నదానిపై మరింత స్పష్టత రానుంది.

2016 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 15 స్థానాలు దక్కగా, ఎన్నార్సీ 8, ఏఐఏడీఎంకే 4, డీఎంకే 2 స్థానాలు గెలిచింది. ఈసారి ఆ సమీకరణాలు మారనున్నాయని తాజా ట్రెండ్స్ చెబుతున్నాయి.