నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్, తిరుపతిలో వైసీపీ అభ్యర్థుల ఆధిక్యం

02-05-2021 Sun 10:04
  • నాగార్జున సాగర్‌లో మూడో స్థానంలో బీజేపీ
  • తొలి రౌండ్‌లో నోముల భగత్‌కు 4,230 ఓట్లు
  • జానాకు 2,853 ఓట్లు
  • కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
nomula bhagath leads in Nagarjuna Sagar Bypolls

తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా తొలి రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 4,230 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,853 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రవికి కేవలం 157 ఓట్లే పోలయ్యాయి. ఇక, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు.