కరోనాతో కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు

02-05-2021 Sun 08:09
  • కరోనాతో విశాఖలోని ఓ ఆసుపత్రిలో చేరిన రామారావు
  • 1994, 2004 లో పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • టీడీపీ నేతల సంతాపం
TDP Leader Boddu Bhaskara Ramarao Passed Away with Corona

కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలితీసుకుంది. టీడీపీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బొడ్డు భాస్కర రామారావు కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కరోనా వైరస్ సంక్రమించడంతో విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

1994, 2004లో పెద్దాపురం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన రామారావు ఎమ్మెల్సీగానూ పనిచేశారు. పెదపూడి మండలంలోని పెద్దాడకు చెందిన ఆయన అంతకుముందు అంటే 1982లో సామర్లకోట సమితి అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. ఆ తర్వాత 1984లో జడ్పీ చైర్మన్‌గా సేవలు అందించారు. రామారావు మృతికి పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.