District Collector: ఈటలపై భూకబ్జా ఆరోపణలు... సీఎస్ కు నివేదిక సమర్పించిన మెదక్ జిల్లా కలెక్టర్

  • చిక్కుల్లోపడిన ఈటల
  • అసైన్డ్ భూములు ఆక్రమించారని ఆరోపణలు
  • విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్
  • ఆరు బృందాలతో భూములు సర్వే చేసిన కలెక్టర్
  • రైతుల నుంచి వివరాల సేకరణ
Medak district collector submits report to CS on Eatala land grabbing issue

ఈటల రాజేందర్ భూ అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కు నివేదిక సమర్పించారు. ఈటల 66 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆ నివేదికలో పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా చాలా వృక్షాలను నరికివేసినట్టు గుర్తించినట్టు తెలిపారు. మొదటిరోజు విచారణలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని కలెక్టర్ వివరించారు. ఈ మేరకు 6 పేజీల నివేదిక రూపొందించారు.

ఈ ఉదయం కలెక్టర్ హరీశ్ ఆరు ప్రత్యేక బృందాలతో భూములను సర్వే చేశారు. ఈటల కుటుంబానికి చెందిన హేచరీస్ లో డిజిటల్ సర్వే నిర్వహించారు. అచ్చంపేట గ్రామ రైతుల నుంచి వివరాలు సేకరించి, ఆపై ప్రాథమిక నివేదిక రూపొందించారు.

More Telugu News