Devineni Uma: వరుసగా రెండో రోజూ సుదీర్ఘ సమయం పాటు దేవినేని ఉమను విచారించిన సీఐడీ అధికారులు

  • సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేశాడంటూ ఉమపై ఆరోపణలు
  • ఉమపై సీఐడీ విచారణ
  • నిన్న కూడా 9 గంటల పాటు విచారణ
  • తదుపరి విచారణకు 4వ తేదీన హాజరవ్వాలని ఉమకు ఆదేశం
CID questioning on Devineni Uma concludes today

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, వీడియో మార్ఫింగ్ కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమను సీఐడీ అధికారులు వరుసగా రెండో రోజు కూడా సుదీర్ఘ సమయం పాటు విచారించారు. సీఐడీ కార్యాలయంలో దాదాపు 9 గంటల పాటు కొనసాగిన విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది.

తదుపరి విచారణ కోసం ఈ నెల 4వ తేదీన తమ ముందు హాజరు కావాలని దేవినేని ఉమను సీఐడీ అధికారులు ఆదేశించారు. కాగా, నిన్న జరిగిన విచారణలోనూ ఉమను 9 గంటల సమయం పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

More Telugu News