తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

01-05-2021 Sat 20:29
  • కరోనా బారినపడుతున్న రాజకీయ నేతలు
  • తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న పువ్వాడ
  • ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా నిర్ధారణ
  • పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు పువ్వాడ వెల్లడి
Telangana minister Puvvada Ajay Kumar tested corona positive

తొలి దశతో పోల్చి తే కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య అధికంగా నమోదవుతోంది. తాజాగా, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలతో బాధపడుతుండడంతో ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు.

దీనిపై మంత్రి పువ్వాడ ట్విట్టర్ లో స్పందించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.