చిరూ కాదన్న పూరి కథ .. 'ఆటో జానీ'గా రవితేజ!

01-05-2021 Sat 17:49
  • రవితేజతో ఐదు సినిమాలు చేసిన పూరి
  • రెండు సినిమాలు భారీ హిట్లు
  • 6వ సినిమాకి సన్నాహాలు  

Raviteja as Auto Johnny in Puri movie

ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ మరోసారి నటించనున్నాడనేది ఆ వార్త సారాంశం. కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ .. చిరంజీవి కోసం 'ఆటో జానీ' కథను రెడీ చేసుకుని వెళ్లి వినిపించాడు. టైటిల్ తో పాటు ఫస్టాఫ్ చిరంజీవికి బాగా నచ్చిందట. సెకండాఫ్ విషయంలో చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ వచ్చింది. ఒకటికి రెండు సార్లు పూరి మార్చేసి వినిపించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో పూరి దగ్గర ఆ కథ అలా ఉండిపోయింది.

ఇప్పుడు ఇదే కథను పూరి .. రవితేజకు వినిపించాడట. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా మార్చమని రవితేజ చెప్పడంతో, అందుకు పూరి ఓకే అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. పూరి - రవితేజ ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐదు సినిమాల్లో 'ఇడియట్' .. 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు 6వ సినిమాకి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం పూరి ఈ ప్రాజెక్టు పైనే దృష్టి పెట్టాడని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.