ధూళిపాళ్లను చూసేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన తల్లి, భార్య

01-05-2021 Sat 16:26
  • సంగం డెయిరీ వ్యవహారంలో ధూళిపాళ్ల అరెస్ట్
  • కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ
  • ధూళిపాళ్లను 5 రోజులు విచారించనున్న అధికారులు
  • ధూళిపాళ్లను చూసే అవకాశం ఇవ్వాలన్న కుటుంబ సభ్యులు
Family members of Dhulipalla arrives at ACB office

సంగం డెయిరీలో స్కాం జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ధూళిపాళ్లను విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు.

ఈ నేపథ్యంలో ధూళిపాళ్లను పరామర్శించేందుకు ఆయన తల్లి, భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఏసీబీ కార్యాలయానికి తరలివచ్చారు. ధూళిపాళ్లను చూసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల అర్ధాంగి జ్యోతిర్మయి మీడియాతో మాట్లాడుతూ, తన భర్తను సంగం డెయిరీ వ్యవహారంలో ఇరికించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు.