ఎంతో మందికి నావంతు సాయం చేశాను: కంగనా రనౌత్

01-05-2021 Sat 16:08
  • ట్విట్టరే కాదు సాయం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి
  • ఎంతో మంది నన్ను సాయం కోరారు
  • పబ్లిసిటీ కోసం నేను ఈ పని చేయలేదు
There are various ways to help others says Kangana Ranaut

కరోనా బాధితులకు సాయం చేయడానికి కాకుండా... కేవలం కేంద్రంలోని బీజేపీని ప్రశంసించడానికే ట్విట్టర్ అకౌంట్ ను వాడుతోందంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి కంగానా రనౌత్ అదే స్థాయిలో స్పందించారు. ప్రజలకు సాయం చేయడానికి ట్విట్టర్ ఒకటే వేదిక కాదని ఆమె అన్నారు. సాయం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో తాను ఎందరికో మందులు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్లను ఏర్పాటు చేయించానని తెలిపారు.

తనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తెలిసిన ఎంతోమంది సాయం కోరారని... వారందరికీ తనవంతు సాయం చేశానని చెప్పారు. పబ్లిసిటీ కోసం తాను ఈ పనులు చేయలేదని తెలిపారు. సెలబ్రిటీల నుంచి ఆన్ లైన్ ద్వారా సాయం పొందిన కొంతమంది ఆక్సిజన్ సిలిండర్లు, మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారని మండిపడ్డారు.