ఈటలకు మరో షాక్.. ఆరోగ్యశాఖను తన కిందకు తెచ్చుకున్న కేసీఆర్!

01-05-2021 Sat 14:25
  • భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల
  • ఈ అంశంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
  • శాఖ లేని మంత్రిగా మిగిలిన ఈటల
Etela Rajender portfolio transferred to KCR

తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన శాఖపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి తనకు అటాచ్ చేసుకున్నారు.

ఈ మేరకు సీఎం చేసిన సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమెదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదముద్రతో శాఖ లేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు. మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిన్నటి నుంచి ఈటల తన విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.