కరోనా బాధితుల కోసం కాంగ్రెస్​ హెల్ప్​ లైన్​

01-05-2021 Sat 12:37
  • ‘హలో డాక్టర్’ పేరిట కార్యక్రమం
  • 9983836838 నంబర్ ఏర్పాటు
  • సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్న రాహుల్ గాంధీ
  • ప్రజలకు సాయపడాలని డాక్టర్లకు విజ్ఞప్తి
Congress launched helpline for Corona Patients

కరోనా కల్లోలం నేపథ్యంలో మహమ్మారి బారిన పడిన పేషెంట్లు, ప్రజలకు సాయం చేసేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఓ హెల్ప్ లైన్ ను ప్రారంభించింది. ‘హలో డాక్టర్’ పేరిట కరోనా మెడికల్ అడ్వైజరీని మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎవరికి ఎలాంటి సందేహాలున్నా 9983836838 నెంబర్ కు ఫోన్ చేయొచ్చని పేర్కొన్నారు. ఇందుకు గానూ డాక్టర్ల సాయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమంలో వైద్యులు నమోదు చేసుకోవాలని, ప్రజలకు ఎంతో కొంత సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఓ ఆన్ లైన్ దరఖాస్తును సృష్టించారు. ప్రజలకు సేవల చేయాలనుకునే వైద్యులు అందులో నమోదు చేసుకోవాలని సూచించారు.