మీ ఇద్దరి కేసులపై విచారణ జరిగితే జీవితాంతం జైల్లోనే గడపాలి ఉమ: విజ‌య‌సాయిరెడ్డి

01-05-2021 Sat 12:19
  • జగన్ గారి మాటలను వక్రీకరించేలా వీడియో మార్ఫింగ్
  • అడ్డంగా దొరికాడు ఉమ
  • సీఐడీ విచారణకు వెళ్లి కొత్త స్టోరీ అల్లాడు
  • 20 కేసుల్లో స్టేలతో గడుపుతున్న చంద్రబాబు పత్తిగింజ అయినట్టు మాట్లాడారు
vijay sai reddy slams tdp

సీఎం జగన్ పై మార్ఫింగ్ చేసిన ఓ వీడియోను ఇటీవ‌ల మీడియా సమావేశంలో ప్ర‌ద‌ర్శించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై  సీఐడీ అధికారులు విచార‌ణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు.  

'సీఎం జగన్ గారి మాటలను వక్రీకరించేలా వీడియో మార్ఫింగ్ చేసి అడ్డంగా దొరికాడు ఉమ. సీఐడీ విచారణకు వెళ్లి కొత్త స్టోరీ అల్లాడు. 20 కేసుల్లో స్టేలతో గడుపుతున్న చంద్రబాబు పత్తిగింజ అయినట్టు, ఇరికించాలని చూస్తున్నారట. మీ ఇద్దరి కేసులపై విచారణ జరిగితే జీవితాంతం జైల్లోనే గడపాలి ఉమ' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.