మహిళా కానిస్టేబుల్ కు లైంగిక వేధింపులు.. సీఐ సస్పెన్షన్!

01-05-2021 Sat 11:43
  • కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సీఐ శ్రీనివాస్ రెడ్డి
  • చాటింగ్ లు, వీడియోకాల్స్ తో వేధింపులు
  • సీపీకి ఆధారాలు చూపించిన బాధితురాలి బంధువులు
CI who assaulted woman constable sexually suspended

మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సీఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ పై అదే స్టేషన్ లో పని చేస్తున్న సీఐ శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

ఫోన్లు చేస్తూ వేధించడమే కాకుండా.. చాటింగ్ లు, వీడియో కాల్స్ చేస్తూ మానసిక హింసకు గురి చేస్తున్నారు. సీఐ వ్యవహారశైలితో మనస్తాపం చెందిన బాధితురాలు తన కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం బాధితురాలి బంధువు రమాగౌడ్ సీపీకి సాక్ష్యాలను చూపించారు. దీంతో, సీఐను సస్పెండ్ చేస్తూ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.