కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య

01-05-2021 Sat 08:14
  • గత నెల 20న కరోనా బారినపడిన సునీత
  • తాజాగా మ్యాక్స్ ఆసుపత్రిలో చేరిక
  • త్వరగా కోలుకోవాలని ఆప్ నేతల ఆకాంక్ష
Sunita Kejriwal hospitalised

కరోనా బారినపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సునీత గత నెల 20న కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

తాజాగా, ఆమె ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు. ఆమె చాలా ధైర్యవంతురాలని, కరోనా ఆమెను ఏమీ చేయలేదని సోమనాథ్ భారతి పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. భార్య సునీతకు కరోనా సోకడంతో కేజ్రీవాల్ కూడా హోం ఐసోలేషన్‌లో ఉండి త్వ‌ర‌గానే కోలుకున్నారు . కాగా, సునీత ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన ఆప్ నేతలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.