ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ లీక్.. ఇబ్బంది పడుతున్న పేషెంట్లు!

30-04-2021 Fri 19:53
  • లీకేజీని అరికట్టడానికి యత్నిస్తున్న ఆసుపత్రి సిబ్బంది
  • గంటన్నర నుంచి ప్రయత్నిస్తున్నా అదుపులోకి రాని పరిస్థితి
  • పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్
Oxygen leaked in Eluru Govt hospital

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లీకైన ఘటనల్లో ఇప్పటికే పలువురు మృతి చెందిన ఘటనలు తెలిసిందే. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ లీక్ అయింది. లీకేజీని అరికట్టడానికి ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గంటన్నర నుంచి ప్రయత్నిస్తున్నా ఆక్సిజన్ లీకేజీ అదుపులోకి రాలేదని సిబ్బంది తెలిపారు. మరోవైపు పరిస్థితిని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఆక్సిజన్ లీకేజీతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. రోగులను అవసరమైతే ఇతర ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశారు. లీకేజీ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.