ఐపీఎల్: పంజాబ్ కింగ్స్ పై టాస్ గెలిచిన బెంగళూరు

30-04-2021 Fri 19:25
  • అహ్మదాబాద్ లో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు సారథి కోహ్లీ
  • బెంగళూరు జట్టులో సుందర్ స్థానంలో షాబాజ్
  • పంజాబ్ జట్టులో మూడు మార్పులు
  • మెరిడిత్, ప్రభ్ సిమ్రన్, హర్ ప్రీత్ లకు చోటు
RCB won the toss against Punjab Kings

ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ కి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించే ఈ మ్యాచ్ కు కొద్దిసేపటి కిందే టాస్ వేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్ కోసం పంజాబ్ జట్టు మూడు మార్పులు చేసింది. మయాంక్ అగర్వాల్, మోజెస్ హెన్రిక్స్, అర్షదీప్ లను తప్పించి, వారి స్థానంలో మెరిడిత్, ప్రభ్ సిమ్రన్, హర్ ప్రీత్ లను తుది జట్టులోకి తీసుకున్నట్టు పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఇక బెంగళూరు జట్టులో ఒక మార్పు జరిగింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ ను ఎంపిక చేశారు. పాయింట్ల పట్టికలో బెంగళూరు మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ ఆరో స్థానంలో ఉంది.