స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్?

30-04-2021 Fri 18:46
  • కొరటాలతో  ఎన్టీఆర్ మూవీ
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
  • వచ్చే ఏడాదిలో విడుదల  

Ntr as a student leader in Koratala Siva movie

ఎన్టీఆర్ .. కొరటాల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే విషయం అధికారికంగా బయటికి రాగానే, అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఈ సినిమా షూటింగు మొదలుకాకముందే రిలీజ్ డేట్ ను కూడ ప్రకటించడంతో, ప్రాజెక్టుపై బలమైన నమ్మకంతోనే అంతా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి లుక్ తో కనిపించనున్నాడు? ఆయన పాత్ర ఎలా ఉండనుంది? ఆ పాత్ర ఉద్దేశం .. ఆశయం ఏమిటి? కొరటాల ఆ పాత్రను ఎలా డిజైన్ చేసి ఉంటారు? వంటి ప్రశ్నలు అభిమానులలో మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ కథ రాజకీయాలను టచ్ చేస్తూనే వెళుతుందని అంటున్నారు.  స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెబుతున్నారు. స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని అంటున్నారు. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో బరిలోకి దిగిన హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? చివరికి ఆయన అనుకున్నది సాధిస్తాడా లేదా? అనే అంశాలతో కథ ఆసక్తికరంగా నడుస్తుందని అంటున్నారు. కరోనా ఉధృతి తగ్గగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.