ఆరోగ్య మంత్రి ఈటల చెపితే వినేవాళ్లు కరువయ్యారు: భట్టి విక్రమార్క
- ఆసుపత్రుల్లో ఇంతవరకు సౌకర్యాలను పెంచలేకపోయారు
- సచివాలయం లేకపోవడంతో పాలన కుప్పకూలింది
- కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నారని... పేద ప్రజల వైద్యానికి మాత్రం బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ చెపుతున్న మాటలను వినేవాళ్లు కూడా ప్రభుత్వంలో లేరని విమర్శించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.