Telangana: తెలంగాణలో ముగిసిన మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్

  • రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు
  • ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
  • సాయంత్రం 5 గంటలకు ముగింపు
  • అప్పటివరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
  • విజయంపై ఎవరికి వారే ధీమా
Telangana mini municipal elections polling concludes

తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు నిర్వహించిన పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు.

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు... కొత్తూరు, జడ్చర్ల, సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఇవాళ పోలింగ్ జరిగింది. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. విజయంపై టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ సైతం గెలుపు అవకాశాలపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News