కరోనా ఆపత్కాలంలో అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తిన సినీ నటుడు

30-04-2021 Fri 16:33
  • దేశంలో కరోనా కల్లోలం
  • కర్ణాటకలోనూ కొవిడ్ స్వైరవిహారం
  • ఆపద్బాంధవుడిలా అర్జున్ గౌడ
  • అంబులెన్స్ ద్వారా కరోనా రోగుల తరలింపు
  • అంత్యక్రియల్లో సాయం
Kannada actor Arjun Gowda turns ambulance driver for covid patients

కరోనా వైరస్ భూతం కుటుంబాలకు కుటుంబాలనే విచ్ఛిన్నం చేస్తున్న ప్రస్తుత కాలంలో ఏ చిన్న సహాయం కూడా విలువైనదే. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ సినీ నటుడు అర్జున్ గౌడ కరోనా బాధితుల కోసం అంబులెన్స్ డ్రైవర్ గా మారారు. బెంగళూరు పరిధిలో కరోనా రోగులను ఆసుపత్రులకు తరలించడమే కాదు, కరోనాతో కన్నుమూసిన వారి అంత్యక్రియలకు ఉదారంగా సహకరిస్తున్నారు.

గత కొన్నిరోజుల నుంచి తన మకాం రోడ్డుపైనే అని అర్జున్ గౌడ వెల్లడించారు. ఇప్పటిదాకా, అనేకమందిని ఆసుపత్రులకు తరలించానని, ఒక అరడజను మందికి అంత్యక్రియల విషయంలో సాయం చేశానని అర్జున్ గౌడ వెల్లడించారు. ఈ కష్టకాలంలో ప్రాంతాలు, మతాలకు అతీతంగా సాయం చేయాలని అందరికీ పిలుపునిచ్చారు.