Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • 983 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 263 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • నాలుగు శాతానికి పైగా నష్టపోయిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేరు
Sensex loses 983 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈనాటి ట్రేడింగ్ ను బలహీనంగా ప్రారంభించిన మార్కెట్లు... చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. కరోనా ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఆసియా మార్కెట్లు కూడా డీలా పడటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, టెలికాం తదితర సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 983 పాయింట్లు నష్టపోయి 48,782కి పడిపోయింది. నిఫ్టీ 263 పాయింట్లు కోల్పోయి 14,631కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-4.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-4.09%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.36%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-3.24%), ఏసియన్ పెయింట్స్ (-2.81%).

టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (4.32%), సన్ ఫార్మా (1.57%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.23%), బజాజ్ ఆటో (0.18%).

More Telugu News