తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మరో వారం పొడిగింపు

30-04-2021 Fri 14:39
  • తెలంగాణలో కరోనా విజృంభణ
  • వేల సంఖ్యలో కొత్త కేసులు
  • ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ
  • ఏ మాత్రం అదుపులోకి రాని కొవిడ్
  • మే 8వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
Night curfew extends for a week in Telangana

తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట కర్ఫ్యూను మరో వారం పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కొత్త కేసులు వెల్లువలా వస్తుండడంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయింది.

మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 7,646 పాజిటివ్ కేసులు రాగా, 53 మంది మృత్యువాత పడ్డారు.