Venkaiah Naidu: తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు అందించిన శ్రీశ్రీ కవిత్వం ఆలోచనాత్మకం: వెంకయ్యనాయుడు

  • మహాకవిగా పేరుగాంచిన శ్రీశ్రీ
  • నేడు శ్రీశ్రీ జయంతి
  • స్పందించిన భారత ఉపరాష్ట్రపతి
  • సాహిత్యాన్ని శ్రీశ్రీ కొత్త పుంతలు తొక్కించారని వ్యాఖ్యలు
  • తెలుగు కవితను సామాన్యుడికి చేరువ చేశారని కితాబు
  • శ్రీశ్రీ ఆలోచనలను యువత అర్థం చేసుకోవాలని పిలుపు
Venkaiah Naidu paid tributes to Mahakavi Sri Sri on his birth anniversary

నేడు మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) జయంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించడమే కాకుండా, తెలుగు కవితను సామాన్యులకు చేరువ చేసిన మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. 1000కి పైగా సినీ గీతాలు రచించి, తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు అందించిన ఆయన కవిత్వం ఆలోచనాత్మకం అని వివరించారు.

సంప్రదాయ కవితా విధానాన్ని తోసిరాజని శ్రీశ్రీ... కార్మిక, కర్షక, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల బతుకులనే కవితా వస్తువులుగా ఎన్నుకుని సమాజంలో ఆలోచన రేకెత్తించారని వెంకయ్య వెల్లడించారు. శ్రీశ్రీ ఆలోచనల్లోని అంతరార్ధాన్ని గ్రహించి నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను అని పిలుపునిచ్చారు.

More Telugu News