కేంద్ర మంత్రుల‌తో మోదీ కీల‌క భేటీ.. దేశవ్యాప్త‌ లాక్‌డౌన్‌పై స్ప‌ష్ట‌త‌

30-04-2021 Fri 13:31
  • రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై చ‌ర్చ‌
  • దేశ వ్యాప్త‌ లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన లేదని స్ప‌ష్టం
  • రాష్ట్రాల్లో ఉన్న క‌రోనా కేసుల ఆధారంగా క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న
  • కంటైన్‌మెంట్‌ జోన్లను కొనసాగించాలని వ్యాఖ్య‌
no lockdown in india says modi

దేశంలో రెండో ద‌శ‌లో క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో నెల‌కొన్న‌ ప‌రిస్థితుల‌పై కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స‌మావేశ‌మ‌య్యారు. వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతోన్న ఈ సమావేశంలో ప‌లువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మం, తీసుకుంటోన్న చ‌ర్య‌లపై ఆయ‌న చ‌ర్చిస్తున్నారు.

క‌రోనా రోగులు ప్ర‌తిరోజు ల‌క్ష‌ల సంఖ్య‌లో పెరిగిపోతున్న నేప‌థ్యంలో ఆసుపత్రుల్లో సౌక‌ర్యాల వంటి వాటిపై కూడా ఆయ‌న చర్చ‌లు జ‌రుపుతున్నారు. దేశ వ్యాప్త‌ లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన లేదని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ చెప్పారు.

రాష్ట్రాల్లో ఉన్న క‌రోనా కేసుల ఆధారంగా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలే  చర్యలు తీసుకోవాలని చెప్పారు. క‌రోనా అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ జోన్లను కొనసాగించాలని చెప్పారు. క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య పెంచాలని సూచించారు.