'ఆర్ ఆర్ ఆర్' మళ్లీ వాయిదా పడనుందా?

30-04-2021 Fri 12:22
  • చారిత్రక అంశంతో రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్'
  • కరోనా కారణంగా జరుగుతున్న ఆలస్యం
  • విడుదల తేదీపై పడుతున్న ప్రభావం    

RRR Movie Releae Postponed

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనుకోని అవాంతరాల కారణంగా అప్పుడప్పుడూ షూటింగు ఆగుతూ .. విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. అలియా భట్ .. ఒలీవియా ఈ సినిమాలో కథానాయికల పాత్రల్లో కనిపించనున్నారు. ఇది చరిత్రతో ముడిపడిన కథ. అందువలన ఆయా పాత్రల లుక్స్ విషయం దగ్గర నుంచి ప్రతి విషయంలోను ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది.

ముందుగా ఈ సినిమాను జూలై 30 - 2020న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లకు తీసుకువస్తామని చెప్పారు. కానీ అంతకుందు జరిగిన ఆలస్యం ఈ విడుదల తేదీపై ప్రభావం చూపింది. ఇక ఇదే ఏడాది అక్టోబర్ 13వ తేదీన పక్కా అన్నారు. కానీ ఇప్పుడు ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో చిత్రీకరించవలసిన సీన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయట. అందువలన ఇంకా ఆలస్యం కావొచ్చని చెప్పుకుంటున్నారు. అది నిజమే అయితే ఎలాగో అధికారిక ప్రకటన వస్తుంది కదా!