ఓవర్సీస్ లో ప్రభాస్ కి గల క్రేజ్ అలాంటిది మరి!

30-04-2021 Fri 11:38
  • రొమాంటిక్ డ్రామాగా 'రాధేశ్యామ్'
  • తెరపై అందమైన అద్భుతం
  • జూలై 30వ తేదీన విడుదల

Big deals for Radhe Shyam from overseas distributors

ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'రాధే శ్యామ్' పైనే ఉంది .. ఆయన నుంచి రానున్న సినిమా ఇదే. ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే అలరించనుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇది పునర్జన్మలతో ముడిపడిన ప్రేమకథ .. గ్రాఫిక్స్ తో పెద్దగా పని ఉండదు. కానీ ఈ ప్రేమకథను అందమైన దృశ్యకావ్యంగా ఆవిష్కరించడం కోసం, అద్భుతమైన విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం భారీగానే ఖర్చుచేస్తూ వచ్చారు.

జూలై 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సినిమాకి, ఒక  రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని అంటున్నారు. ఆయన సినిమాలకి ఓవర్సీస్ లోను విపరీతమైన డిమాండ్ ఉంది. అందువలన ఓవర్సీస్ హక్కుల కోసం బడా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నారట. అక్కడ నెలకొన్న పోటీని బట్టి ఓవర్సీస్ హక్కులు 3.5 మిలియన్ డాలర్లకుగానీ, 4 మిలియన్ డాలర్లకుగాని అమ్ముడు కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి .. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో, ఎంతటి సంచలనం రేకేత్తిస్తుందో!