ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన పృథ్వీ షా... లక్ష్యఛేదనలో ఢిల్లీ దూకుడు

29-04-2021 Thu 21:55
  • ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ కోల్ కతా
  • 20 ఓవర్లలో 154 రన్స్ చేసిన కోల్ కతా
  • లక్ష్యఛేదనలో తొలి ఓవర్లోనే షా వీరవిహారం
  • శివం మావికి చుక్కలు చూపించిన వైనం
Prithvi Shaw hits six fours in six balls

ఇటీవల సూపర్ ఫామ్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా మరోసారి తన బ్యాట్ పవర్ రుచి చూపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే తన ఉద్దేశాన్ని ఘనంగా చాటాడు. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... యువ బౌలర్ శివం మావి వేసిన ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు బాదాడు. ఎటు బంతి వేసినా సరే... అలవోకగా బౌండరీ లైన్ కు తరలించాడు.

పృథ్వీ షా మెరుపుదాడితో 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ జట్టు 67 పరుగులు చేసింది. అందులో పృథ్వీ షా వాటానే 48 పరుగులున్నాయి. ఈ 48 పరుగులను షా కేవలం 15 బంతుల్లోనే చేశాడు. అందులో 9 ఫోర్లు, 1 సిక్సు ఉన్నాయి. మరో ఎండ్ లో శిఖర్ ధావన్ 17 పరుగులతో ఉన్నాడు.