రసెల్ మెరుపులు... గౌరవప్రద స్కోరు సాధించిన కోల్ కతా

29-04-2021 Thu 21:33
  • ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ ఢిల్లీ
  • మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్
  • 27 బంతుల్లో 45 పరుగులు చేసిన రసెల్
  • రాణించిన శుభ్ మాన్ గిల్
Russel quick batting helps KKR reasonable score against Delhi Capitals

ఐపీఎల్ 14వ సీజన్ మిగతా జట్ల కంటే కాస్త వెనుకబడిన కోల్ కతా నైట్ రైడర్స్... ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో గౌరవప్రద స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 45 పరుగులు చేశాడు. అంతకుముందు, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 43 పరుగులతో రాణించాడు.

ఇటీవల వరుసగా విఫలమవుతున్న గిల్ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి రావడం కోల్ కతాకు ఊరట కలిగించే విషయం అని చెప్పాలి. ఇక మిడిలార్డర్ లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్ ఇద్దరూ డకౌట్ కావడం భారీ స్కోరు అవకాశాలను ప్రభావితం చేసింది.