నీ వద్ద కోట్ల రూపాయల డబ్బుంది... ఆక్సిజన్ కోసం దేశానికి సాయం చేయొచ్చుగా!: కంగనాకు రాఖీ సావంత్ సూచన

29-04-2021 Thu 17:54
  • భారత్ లో కరోనా కల్లోలం
  • ఆక్సిజన్ కొరతతో తల్లడిల్లుతున్న రోగులు
  • స్పందించిన రాఖీ సావంత్
  • దేశ ప్రజలను ఆదుకోవాలంటూ కంగనాకు సూచన
Rakhi insists Kangana Ranaut help the nation

కంగనా రనౌత్, రాఖీ సావంత్... ఈ ఇద్దరు బాలీవుడ్ భామలు సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు! అయితే, దేశంలో కరోనా పరిస్థితులు దారుణంగా తయారైన నేపథ్యంలో రాఖీ సావంత్... కంగనాను ఉద్దేశించి ఆసక్తికర  వ్యాఖ్యలు చేసింది. దేశం ఆక్సిజన్ కొరతతో సతమతమవుతోందని, కంగనా దేశ ప్రజలకు సాయం చేయాలని రాఖీ పేర్కొంది.

"కంగనా... నీ వద్ద ఎన్నో కోట్ల రూపాయల డబ్బు ఉంది. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసి ఆదుకో. ఆక్సిజన్ కొనుగోలు కోసం మీ వద్ద ఉన్న డబ్బు ఇవ్వొచ్చుగా!" అని సూచించింది. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాఖీ పైవిధంగా సమాధానం ఇచ్చింది. అంతేకాదు, కరోనా నివారణ కోసం రెండు మాస్కులు ధరించాలని తన అభిమానులను కోరింది. నిత్యం తమ వెంట శానిటైజర్లను ఉంచుకోవాలని సూచించింది.