హిట్టు ఇస్తే చాలు .. డైరెక్టర్ ను వదులుకోని హీరో!

29-04-2021 Thu 17:54
  • 'నెర్కొండ పారవై'తో హిట్
  • సెట్స్  పై ఉన్న 'వలిమై'
  • వినోత్ కి మరో ఛాన్స్ ఇచ్చిన అజిత్

Ajith gave another chance to director Vinoth

హీరో అజిత్ కి కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. హీరో అజిత్ ఇంట్లో ఉన్నా .. సెట్లో ఉన్న సినిమాను గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే సినిమాను ఆయన ఒక తపస్సుగా భావిస్తూ ఉంటాడు .. అంతే అంకితభావంతో చేస్తూ వెళుతుంటాడు. తనతో సినిమా చేసేవారిలో అంతటి అంకితభావం కనిపిస్తేనే ఆయన ఓకే అంటాడు .. లేదంటే సింపుల్ గా నో చెప్పేస్తాడు. ఇక తనకి దర్శకుల పనితీరు నచ్చితే వాళ్లతోనే వరుస సినిమాలు చేస్తూ ఉంటాడు .. అది ఆయనకి అలవాటు.

దర్శకుడు హెచ్. వినోత్ విషయంలోను ఆయన ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. హిందీలో విజయాన్ని సాధించిన 'పింక్' సినిమాను తమిళంలో 'నెర్కొండ పారవై' పేరుతో రీమేక్ చేశారు. అజిత్ హీరోగా వినోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఘన విజయాన్ని అందుకుంది. దాంతో తదుపరి సినిమా అయిన 'వలిమై'తో వినోత్ కి అజిత్ ఛాన్స్ ఇచ్చాడు. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఇక తాజాగా వినోత్ కి అజిత్ మరో ఛాన్స్ కూడా ఇచ్చాడని అంటున్నారు. సుధా కొంగరతో చేయనున్న సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. అజిత్ మనసు దోచుకుంటే అంతేమరి!