5వ తేదీ నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేశ్

29-04-2021 Thu 17:43
  • వెబ్ సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు
  • పరీక్షల సామగ్రి ఎగ్జామ్ సెంటర్లకు చేరుతోంది
  • అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
AP Inter exams to start from May 5 says Adimulapu Suresh

వచ్చే నెల 5వ తేదీన ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. వెబ్ సైట్లో ఈరోజు నుంచే విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు పరీక్షల సామగ్రి చేరుతోందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక పరీక్షా కేంద్రాలు, గుంటూరు జిల్లాలో తక్కువ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.

పరీక్షల నిర్వహణ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. మొబైల్ మెడికల్ వ్యానులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ స్పెషల్ అధికారి ఉంటారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంటర్ పరీక్షలను రద్దు చేయలేదని తెలిపారు. విద్యార్థుల జీవితాలను దృష్టిలో ఉంచుకునే పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పరీక్షల నిర్వహణ కఠిన నిర్ణయమే అయినా విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.