బుల్లితెరను ముంచెత్తిన 'ఉప్పెన'

29-04-2021 Thu 17:30
  • వెండితెరపై భారీ విజయం
  • బుల్లెతెరపై కూడా తగ్గని ఆదరణ
  • ఇంతగా ఆకట్టుకోవడానికి కారణాలివే!

Uppena mesmerized in small screen too

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై 'ఉప్పెన' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అసలైన హిట్ అంటే ఇదీ .. సిసలైన వసూళ్లంటే ఇవీ అని చాటిచెప్పిన సినిమా ఇది. ప్రేమకి కులాలు .. అంతరాలు ఎప్పుడూ అడ్డమే. ఎవరికి అవసరమైతే వారు వాటిని కూలదోయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అదే విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు కొత్తగా చెప్పాడు .. సరికొత్తగా చూపించాడు. రొటీన్ కి భిన్నమైన కథకి రొమాంటిక్ సాంగ్స్ తోడైతే ఎలా ఉంటుందనేది ఈ సినిమా నిరూపించింది. వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా, ఇటీవల 'స్టార్ మా' ఛానల్ లో ప్రసారమైంది.

ప్ర్రేమ జంటకు ప్రేక్షకుల అండదండలు ఎప్పుడూ ఉంటాయి .. అందునా సక్సెస్ అయిన జంటాయే. వదులుతారా .. ఒక రేంజ్ రేటింగ్ ఇచ్చి మరీ అభినందించారు. స్టార్ మా ఛానల్ లో మొదటిసారిగా ప్రసారమైన ఈ సినిమాకి, 18.5 రేటింగ్ రావడం విశేషం. ఈ మధ్య కాలంలో ఇంతటి రేటింగ్ ను సాధించిన సినిమా ఇదేనని అంటున్నారు. కథాకథనాల్లోని బలం .. పాత్రలను మలచినతీరు .. ఆకట్టుకునే పాటలు ఈ సినిమా ఇంతగా ప్రేక్షకులకు చేరువకావడానికి కారణమని చెప్పుకుంటున్నారు.