ఐపీఎల్: ముంబయి ఇండియన్స్ టార్గెట్ 172 రన్స్

29-04-2021 Thu 17:28
  • ఐపీఎల్ లో ముంబయి వర్సెస్ రాజస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 రన్స్
  • రాణించిన సంజూ శాంసన్, జోస్ బట్లర్
Rajsthan Royals set Mumbai Indians reasonable target

ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 42, జోస్ బట్లర్ 41, శివమ్ దూబే 35, యశస్వి జైస్వాల్ 32 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ కు రెండు వికెట్లు దక్కాయి. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో బుమ్రా 4 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులే ఇవ్వడం విశేషం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే.