వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్: సీఎం జగన్

29-04-2021 Thu 17:14
  • ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ పై సీఎం సమీక్ష
  • వ్యాక్సినేషన్ ఓ సమస్యగా మారిందని వెల్లడి
  • 18-45 ఏళ్ల వారికి సెప్టెంబరు నుంచి టీకా
  • ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జాగ్రత్తగా ఉండాలని సూచన
CM Jagan reviews covid vaccination in state

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియడంలేదని, వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వగలమని భావిస్తున్నట్టు తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారం అని స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్పి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసు వారికి సెప్టెంబరు నుంచి టీకా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2022 ఫిబ్రవరి వరకు అందరం జాగ్రత్తగా ఉండాలని అన్నారు.