'యాత్ర' దర్శకుడితో నితిన్?

29-04-2021 Thu 17:07
  • నితిన్ తాజా చిత్రంగా 'అంధాదున్'
  • తరువాత ప్రాజెక్టుగా 'పవర్ పేట'
  • నితిన్ నిర్ణయం కోసమే వెయిటింగ్    

Nithin upcoming movie with Mahi V Raghav

'యాత్ర' సినిమాతో దర్శకుడిగా మహి.వి రాఘవ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఆయన నుంచి వరుస సినిమాలు రావొచ్చునని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. కొన్ని రోజులుగా ఆయన పేరు మళ్లీ వినిపిస్తోంది. ఆయన ఒక కొత్త కథను సిద్ధం చేసుకున్నాడట. ఇది మల్టీ స్టారర్ కథ .. ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కథ అంటున్నారు. ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ .. వాళ్ల చుట్టూనే ఈ కథ తిరుగుతుందట. రాఘవ్ ఇటీవల నితిన్ ను కలిసి కథ వినిపించినట్టుగా తెలుస్తోంది.

నితిన్ నుంచి ఈ ఏడాదిలో వచ్చిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆయన మరింతగా దృష్టిపెట్టాడు. 'అంధాదున్' రీమేక్ చేస్తున్న ఆయన ఆ తరువాత మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టాడు. తరువాత సినిమాగా 'పవర్ పేట' ఉండొచ్చునని అంటున్నారు. ఒకవేళ రాఘవ్ చెప్పిన కథకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, 'పవర్ పేట' తరువాత ఉంటుందనే అనుకోవాలి. మరి నితిన్ ఓకే చెబుతాడో లేదో చూడాలి.