కోడిగుడ్డును ఉడకబెట్టడం కూడా నాకు చేతకాదు: ప్రియమణి

29-04-2021 Thu 16:45
  • 'హిజ్ స్టోరీ' అనే హిందీ వెబ్ సైట్ లో నటించిన ప్రియమణి
  • ఇందులో చెఫ్ పాత్రను పోషించిన ప్రియమణి
  • తనకు వంట చేయడం కూడా రాదని వ్యాఖ్య
Even I dont know how to boil the egg says Priyamani

ఎన్నో తెలుగు చిత్రాల ద్వారా అందాల నటి ప్రియమణి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఇటీవలే 'హిజ్ స్టోరీ' అనే హిందీ వెబ్ సిరీస్ లో ఆమె కీలక పాత్రను పోషించింది. ఇందులో సాక్షి అనే చెఫ్ పాత్రలో ఆమె నటించింది.

తాజాగా ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సిరీస్ లో తాను చెఫ్ పాత్రను పోషించానని... అయితే తనకు వంట చేయడం రాదని చెప్పింది. నిజం చెప్పాలంటే తనకు కోడిగుడ్డును ఉడకబెట్టడం కూడా రాదని తెలిపింది. సెట్ లో ఉన్న యువకులు తన కంటే వంట బాగా చేసేవారని... తాను వంట చేయడాన్ని చూసి అందరూ నవ్వుకునేవారని చెప్పింది. తనపై జోకులు వేసేవారని తెలిపింది. అయితే ఇందులో తన నటనను చూసి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారని చెప్పింది.

ఈ నెల 25న ఈ సిరీస్ విడుదలైంది. బాలాజీ టెలిఫిలింస్, డింగ్ ఇన్ఫినిటీ సంస్థలు ఈ సిరీస్ ను నిర్మించాయి. మరోవైపు  ప్రియమణి ప్రస్తుతం 'విరాటపర్వం', 'నారప్ప' చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో అజయ్ దేవగణ్ తో కలిసి 'మైదాన్' చిత్రంలో నటిస్తోంది.