ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... తొలి మ్యాచ్ లో రాజస్థాన్ పై టాస్ నెగ్గిన ముంబయి

29-04-2021 Thu 15:22
  • ఢిల్లీలో ముంబయి వర్సెస్ రాజస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • ముంబయి జట్టులో ఒక మార్పు
  • ఇషాన్ కిషన్ స్థానంలో కౌల్టర్ నైల్
Mumbai Indian won the toss against Rajasthan Royals

ఐపీఎల్ 14వ సీజన్ కరోనా పరిస్థితుల నడుమ కఠినమైన బబుల్ నిబంధనలతో కొనసాగుతోంది. టోర్నీలో ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో ఇషాన్ కిషన్ ను తప్పించి, నాథన్ కౌల్టర్ నైల్ ను తీసుకున్నారు.

పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ ఏడో స్థానంలో ఉంది. టోర్నీలో ముంబయి జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించగా, రాజస్థాన్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అయితే ముంబయి ఇండియన్స్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండడంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కంటే ముందు నిలిచింది.