Medical Devices: 17 వైద్య పరికరాల దిగుమతులకు కేంద్రం అనుమతి

  • 3 నెలల పాటు ఆంక్షల తొలగింపు
  • కస్టమ్స్ క్లియరెన్స్ తర్వాత డిక్లరేషన్ తప్పనిసరి
  • వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు లైన్ క్లియర్
Government Allows Import Of 17 Medical For 3 Months Amid Covid Surge

కరోనా కేసులు పెరుగుతుండడం.. ఆక్సిజన్ , వెంటిలేటర్ల కొరతతో చాలా మంది ప్రాణాలు దక్కకపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 17 వైద్య పరికరాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతినిచ్చింది. మూడు నెలల పాటు ఎలాంటి ఆంక్షలు లేకుండా వాటిని తెప్పించుకోవచ్చని స్పష్టం చేసింది.

అయితే, దిగుమతులకు కస్టమ్స్ విభాగం నుంచి క్లియరెన్సులు వచ్చాక ఆ పరికరాల విక్రయానికి ముందు లీగల్ మెట్రాలజీ నియమాలు 2011 ప్రకారం డిక్లరేషన్ ను సమర్పించాలని సూచించింది. ఈ మేరకు ఈరోజు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

దిగుమతులకు అనుమతినివ్వడం వల్ల ప్రస్తుత డిమాండ్ కు తగ్గట్టు పరికరాల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలవుతుందని గోయల్ చెప్పారు. దీనిపై వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దాని ప్రకారం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సీపీఏపీ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కానిస్టర్లు, ఆక్సిజన్ జనరేటర్లు, నెబ్యులైజర్ వంటి 17 రకాల వైద్య పరికరాలను సంస్థలు దిగుమతి చేసుకోవచ్చు.

More Telugu News