India: ఇండియా నుంచి అందరూ తక్షణమే వచ్చేయండి: తన పౌరులకు అమెరికా హెచ్చరిక

US Tells Citizens To Leave India As Soon As Possible
  • భారత్ లో కరోనా తీవ్రతపై అమెరికా ఆందోళన
  • ఇండియాకు ఎవరూ వెళ్లొద్దని సూచన
  • వీలైనంత త్వరగా భారత్ నుంచి వచ్చేయడమే సురక్షితమని హెచ్చరిక
భారత్ లో కరోనా పరిస్థితి అదుపు తప్పుతోంది. మొన్నటి వరకు కరోనా విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఇండియా... ఇప్పుడు మహమ్మారి దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ పరిస్థితిని చూసి, ఐక్యరాజ్యసమితితో సహా ఎన్నో దేశాలు తమ వంతు సాయం అందిస్తున్నాయి. మరోవైపు, దేశంలో ప్రతి రోజు మూడున్నర లక్షల వరకు కేసులు నమోదవుతున్న తరుణంలో... అమెరికా ఆందోళన చెందుతోంది. ఇండియాలో ఉన్న తమ దేశ పౌరులందరూ స్వదేశానికి తిరిగి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం కోరింది. వీలైనంత త్వరగా అమెరికాకు చేరుకోవాలని చెప్పింది.

లెవెల్-4 ట్రావెల్ అడ్వైజరీ కింద ఇండియాలో ఉన్న తమ పౌరులకు అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇండియాకు ఎవరూ వెళ్లవద్దని, అక్కడున్న వారు త్వరగా తిరిగి రావాలని చెప్పింది. భారత్ నుంచి వచ్చేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమని తెలిపింది. ఇండియా నుంచి అమెరికాకు ప్రతిరోజు 14 డైరెక్ట్ విమానాలు ఉన్నాయని... యూరప్ గుండా మరిన్ని విమాన సర్వీసులు ఉన్నాయని చెప్పింది.  

ఇప్పటికే ఇండియా నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించాయి. భారత్ నుంచి తిరిగి వస్తున్న తమ పౌరులను ఇంగ్లండ్ ఒక హోటల్ లో క్వారంటైన్ చేస్తోంది.
India
USA
Corona Virus
Citizens

More Telugu News